ఉభయగోదావరిలో కూటమి దూకుడు, చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం
ప్రజాగళం మూడో విడతలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కలిసి ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 10, 11 తేదీల్లో కలిసి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ఇద్దరు నేతలు ప్రచారం చేస్తారు. ఈనెల 10న తణుకు, నిడదవోలు, 11న పి. గన్నవరం, అమలాపురంలో ఇద్దరు నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కూటమికి అచ్చి వస్తోందని భావిస్తున్న ఉమ్మడి గోదావరి జిల్లాల్లో గరిష్టంగా సీట్లను గెలుచుకునేలా పార్టీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇద్దరు నేతలు ప్రజల్లో సంయుక్తంగా కన్పించడం ద్వారా ఓటు ట్రాన్సఫర్ కూడా సజావుగా జరుగుతుందని నేతలు భావిస్తున్నారు.


