రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఛైర్ పర్సన్, సభ్యుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానం
హైదరాబాద్, మర్చి 13 :: తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో ఛైర్ పర్సన్, మెంబర్ (జ్యూడిషియల్) , మెంబర్ (నాన్–జ్యూడిషియల్ ) లకు గాను ఏప్రిల్ 10 వ తేదీలోగా దారస్తులు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగం తెలిపింది. ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నెల 10వ తేదీన ప్రముఖ దిన పత్రికల ద్వారా నోటిఫికేషన్ జారీ చేశామని, ఇందుకు అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను నిర్దేశించిన ప్రొఫార్మాలో, తేదీ 10.04.2024 సాయంత్రం 5.00 గం.ల లోపు తెలంగాణ సచివాలయంలోని చీఫ్ సెక్రటరీ గారి కార్యాలయానికి పంపించాలని తెలియచేసింది. అయితే,14.07.2023 తేదీ నాటి గత నోటిఫికేషన్ ను అనుసరించి దరఖాస్తు చేసిన వారందరూ, తిరిగి దరఖాస్తు చేయనవసరం లేదని స్పష్టం చేసింది. అర్హతలకు సంబంధించిన సమాచారాన్ని దరఖాస్తులు అభ్యర్ధులు https://telangana.gov.in వెబ్ సైట్ నుండి పొందవచ్చునని ఒక ప్రకటనలో తెలియచేసారు..