ఈటల, కొండా సమక్షంలో బీజేపీలోకి చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీపీ రమణారెడ్డి
చేవెళ్ళ బీఆర్ఎస్ ఎంపీపీ రమణారెడ్డి బీజేపీలో చేరుతున్న సందర్భంగా చేవెళ్ళలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఏర్పాటు చేసిన ర్యాలీకి, సభకు ఈటల రాజేందర్ హాజరయ్యారు. రమణారెడ్డికి కాషాయ కండువాకప్పి పార్టీలోకి ఇరువురు నేతలు ఆహ్వానించారు.

ఈటల రాజేందర్ కామెంట్స్
దేశవ్యాప్తంగా నరేంద్రమోదీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో చూస్తున్నాం. ఇంత ప్రజాధరణ కలిగిన నాయకున్ని నాజీవితంలో చూడలేదు. ప్రాంతాలు, సంస్కృతి తేడా లేకుండా గల్లా ఎగురవేసి మా ప్రధాని అని చెప్పుకుంటున్నారు. గుజరాత్ సీఎంగా ఎక్కాడా మచ్చలేకుండా పాలన అందించి అభివృద్ధి చేశారు. 2014 లో మోడీ గారి హయాంలో సంకీర్ణ రాజకీయాలకి స్వస్తిచెప్పి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఐదేళ్ళ తరువాత ఎన్నికలకు వెళుతూ ఇప్పటి కాంగ్రెస్, బిఆర్ఎస్ లాగా అమలుకాని హామీలు ఇవ్వలేదు. దేశ ఆత్మగౌరవం ప్రపంచపటం మీద ఆవిస్కరిస్తా అని చెప్పి ఓటు అడిగితే.. రెండవ సారి 303 సీట్లు బీజేపీకి ఇచ్చి అజేయమైన, పటిష్టమైన శక్తిగా నిలిపారు. ఊరికే చెయ్యి ఊపితే, మాటలు చెప్తే రాలేదు. పటిష్టమైన కార్యదీక్షతో ఇది సాధ్యమయ్యింది.
ఒకప్పుడు మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం అమెరికాకు వెళితే విమానాశ్రయంలో బూట్లువిప్పి చెక్ చేశారు. ఇప్పుడు అదే అమెరికా ప్రెసిడెంట్స్ మన ప్రధాని కరచాలనం కోసం ఎదురుచూస్తున్నారు. వారి భుజంమీద చేయి వేసి మాట్లాడేస్థాయికి మనం ఎదిగాం.
కరోనా సమయంలో ప్రపంచంలోని అనేక మంది అధ్యక్షులు దేవుడిమీద భారం వేస్తే.. భారతదేశ ప్రజలకు ధైర్యం ఇచ్చిన వ్యక్తి నరేంద్రమోడీ. ప్రపంచానికి వాక్సిన్ అందించిన వ్యక్తి మోదీ. రాముడి పుట్టిన అయోధ్యలో గుడి కట్టాలని LK అద్వానీ గారు దేశమంతా తిరిగారు. సుప్రీం కోర్టు తీర్పుచ్చిన తరువాత అన్ని వర్గాల వారిని ఒప్పించి మెప్పించి రామమందిరం కట్టి 140 కోట్ల భారతీయులకు అంకితం ఇచ్చిన వ్యక్తి నరేంద్రమోదీ. కాశ్మీర్ లాల్ చౌక్ లో మువ్వొన్నెల జెండా ఎగరాలంటే ప్రాణాలు పోవాల్సిందే అనే పరిస్థితి నుండి స్వేచ్చగా భారత జెండా ఎగురవేసుకుంటున్నాం అంటే ఆ ఘనత మోదీదే. గతంలో మనమీద ఏ దేశం దాడి చేస్తుందో అనే భయం ఉండేది. ఈరోజు అదిలేదు. సుభిక్షంగా ఉంది. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ కి ఆపదవస్తే ఆదుకుంటున్న దేశం భారతదేశం. పాకిస్థాన్, బలుశ్చిస్థాన్లో… POK లో ఉన్న ప్రజలు కూడా భారతదేశంలో కలుస్తామని ఉద్యమిస్తున్నారు అంటే ఎంత గొప్పగా ఎదిగామో చూడండి.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ..
వచ్చే ఎన్నికల్లో నరేంద్రమోదీని గెలిపించడం అంటే విశ్వేశ్వరెడ్డిని గెలిపించడం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రాజకీయాలతో జెండాలతో సంబంధం లేకుండా ఉద్యమించాం. ఇప్పుడు కూడా రాజకీయాలు, జెండాలతో సంబంధం లేదు. భారతకీర్తి పతాకం ప్రపంచ పటం మీద ఎగురవేయాలంటే బీజేపీకి ఓటు వేయాలని కోరుతున్నానన్నారు ఈటల రాజేందర్.

