మే 13 నుంచి ఏపీ ఎంసెట్ (ఈఏపీసెట్), షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి
ఈ ఏడాది ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఏపీ ఉన్నత విద్యామండలి ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల చేసింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే AP EAPCETను మే 13 నుంచి 19 వరకు నిర్వహించనున్నట్టు పేర్కొంది. అదే సమయంలో ఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీజీసెట్, ఏడీసెట్ పరీక్షల తేదీలను ప్రకటించింది. ఎంసెట్ పరీక్షను మే 13 నుంచి 19 మధ్య కాకినాడ జేఎన్టీయూ నిర్వహిస్తుంది. ఈసెట్‌ను మే 8న జేఎన్టీయూ అనంతపురం ఆధ్వర్యంలో జరుగుతుంది. ఐసెట్ పరీక్ష మే 6న, ఎడ్‌సెట్ జూన్ 8న, లాసెట్ జూన్ 9న పీజీసెట్ జూన్ 3 నుంచి 7 మధ్య ఏడీసెట్ జూన్ 13న జరుగుతాయి.

