Andhra PradeshHome Page Slider

వైసీపీకి అంబటి రాయుడు రాజీనామా

అసెంబ్లీ ఎన్నికల వేళ వైసీపీకి షాక్ ల మీద షాక్ లు తగుతున్నాయ్. ఇటీవలే వైసీపీలో చేరిన క్రికెటర్ అంబటి రాయుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తాను వైసీపీని విడుతున్నానని ఆయన ట్వీట్ చేశారు. ‘వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నాను. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. తదుపరి చర్యలు తగిన సమయంలో తెలియజేస్తా’ అంటూ రాసుకొచ్చారు.