“జగన్ మాటలు కోటలు దాటుతాయి..కానీ పనులు గడప కూడా దాటవు”:లోకేష్
ఏపీలో సీఎం జగన్ పాలనపై టీడీపీ నేత నారా లోకేష్ మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్ర సీఎం జగన్ మాటలు కోటలు దాటుతాయి..కానీ పనులు మాత్రం గడప కూడా దాటవని లోకేష్ విమర్శించారు. కాగా జగన్ అధికారంలోకి వచ్చాక కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే కడప స్టీల్ ప్లాంట్‌కు తొలిసారి శిలాఫలకం వేసి నేటికి 4 ఏళ్లు పూర్తైంది అన్నారు.కాగా ఏడాది క్రితం సీఎం జగన్ దానికి మరోసారి శంకుస్థాపన చేశారన్నారు. అయితే మరో 3 నెలల్లో తన పదవి కాలం ముగుస్తున్న సమయంలో ఇంకా అక్కడ పనులు అంగుళం కూడా ముందుకు సాగలేదని లోకేష్ మండిపడ్డారు. ఇలాంటి సీఎంని నమ్మి ఎవరైనా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా అని లోకేష్ ట్విటర్ వేదికగా జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

