Home Page SliderTelangana

ప్రజావాణి కార్యక్రమానికి భారీ స్పందన..

తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి భారీ స్పందన వస్తోంది. ఇవాళ అర్జీలు అందించడానికి వివిధ ప్రాంతాల నుండి భారీగా ప్రజలు ప్రజాభవన్‌కు చేరుకున్నారు. అర కిలోమీటర్ మేర క్యూ పొడవు ఉంది. మంత్రులు, అధికారులు అర్జీలు స్వీకరిస్తున్నారు. భూ సమస్యలు, పింఛన్ల గురించి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్నారు.