ప్రచార రథం నుంచి కింద పడ్డ మంత్రి కేటీఆర్
నిజామాబాద్ ఆర్మూర్‌లో జరిగిన బీఆర్ఎస్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ కోసం వచ్చిన మంత్రి, పార్టీ నేతలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. రిటర్నింగ్ కార్యాలయానికి బయల్దేరినప్పుడు స్వల్ప ప్రమాదం చోటుచేసుకొంది. డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో మంత్రి కేటీఆర్, ఎంపీ సురేష్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి కిందపడిపోయారు. సడెన్ బ్రేక్ వేయడంతో రేలింగ్ ఊడిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకొంది. ఆలూర్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగింది. వాహనం పైనుంచి ఎంపీ సురేష్‌రెడ్డి నేలపై పడ్డారు. ఐతే ఎవరికీ పెద్దగా గాయాలు కాకపోవడంతో నేతలంతా నామినేషన్ కార్యక్రమానికి వెళ్లారు.

