Andhra PradeshHome Page Slider

ఏపీకి జగనే ఎందుకు కావాలంటే..! వైసీపీ కొత్త క్యాంపెయిన్

వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి (వై ఏపీ నీడ్స్ జగన్) ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే) కార్యక్రమం ప్రారంభమవుతుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో వై ఏపీ నీడ్స్ జ‌గ‌న్ అనే కార్యక్రమంపై స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి మీడియా స‌మావేశంలో మాట్లాడారు. జగన్ ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల నుంచి వచ్చిన ఆకాంక్షలతోనే తమ పార్టీ మ్యానిఫెస్టో రూపొందిందని సజ్జల అన్నారు. నాలుగున్నర ఏళ్ళల్లో తమ ప్రభుత్వం ఏం చేసిందో వివరిస్తామని అన్నారు. అంతేకాకుండా తమ ప్రభుత్వంలో కోటి 40 లక్షల కుటుంబాలకు నేరుగా ప్రయోజనం పొందారని.. వాళ్ళ జీవితాల్లో ఆ మేరకు మార్పు వచ్చిందని పేర్కొన్నారు. రాజకీయంగా కూడా నిర్ణయాత్మక స్థాయికి ఎదిగారని, సంక్షేమమే అభివృద్ధి అని జగన్ నిరూపించారని ఉద్ఘాటించారు. రెండేళ్ల కోవిడ్ సంక్షోభాన్ని కూడా దాటుకుని వచ్చామని, ప్రజలకు ఆర్థికంగా, ఆరోగ్య పరంగా ఒక భద్రతను, నమ్మకాన్ని జగన్ కల్పించారు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.