Home Page SliderTelangana

సిట్టింగ్ స్థానాలతో కలిపి ఈసారి జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్‌లో మజ్లిస్ పోటీ

తెలంగాణ ఎన్నికల్లో 2023లో హైదరాబాద్‌లోని తొమ్మిది నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. శుక్రవారం అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన అసదుద్దీన్‌ ఒవైసీ.. ప్రస్తుతం ఉన్న ఏడు నియోజకవర్గాలతో పాటు జూబ్లీహిల్స్‌, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల్లోనూ పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు సయ్యద్‌ అహ్మద్‌ పాషా క్వాద్రీ, ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌లను జాబితా నుంచి తొలగించామన్నారు. మాజీ మేయర్‌లు జుల్ఫికర్‌ అలీ, మాజిద్‌ హుస్సేన్‌ వరుసగా చార్మినార్‌, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని ఆయన తెలిపారు. జాఫర్ హుస్సేన్ మెరాజ్ యాకుత్‌పురా నుంచి, అహ్మద్ బలాలా మలక్‌పేట నుంచి, అకబరుద్దీన్ ఒవైసీ చాంద్రాయణగుట్ట నుంచి పోటీ చేయనున్నారు. కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్‌కు వరుసగా మూడోసారి టికెట్ లభించింది. రెండో జాబితాలో బహదూర్‌పురా, జూబ్లీహిల్స్, రాజేందర్ నగర్ అభ్యర్థులను ప్రకటిస్తారు.