Home Page SliderNational

“నువ్వు సెంచరీలు చేయడానికే పుట్టావేమో”:విరాట్ సోదరి

వరల్డ్ కప్ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు విజృంభిస్తూ..వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.కాగా నిన్న జరిగిన ఇండియా vs  బంగ్లాదేశ్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌పై  పైచేయి సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విరాట్ సోదరి భావనా కోహ్లీ ధింగ్రా ఆయన సెంచరీపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. నువ్వు సెంచరీలు చేయడానికే పుట్టావేమో అనిపిస్తుంది. నీ హర్డ్ వర్క్ ,ఆట పట్ల నీకున్న ప్యాషన్ ..నీ ప్రతి అడుగులో కన్పిస్తోంది. అయితే కుటుంబ సభ్యులుగా నీ విజయాలను ఆస్వాదించడం మా అదృష్టం. “గాడ్ బ్లెస్ యూ విరాట్” అని భావన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.ఇది చూసిన విరాట్ ఫ్యాన్స్ మాకు కూడా అలానే అనిపిస్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు.ఈ సెంచరీతో విరాట్ ఇప్పటివరకు జరిగిన వన్డే క్రికెట్ మ్యాచుల్లో 48 సెంచరీలు బాదారు.