చంద్రబాబు అరెస్టుపై జూ. ఎన్టీఆర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ : బాలకృష్ణ
చంద్రబాబు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోయిన పట్టించుకోనని ఐ డోంట్ కేర్ అని హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన బుధవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అరెస్టును సినిమా రంగంలో ఎవరు ఖండించకపోయినా పట్టించుకోనని అన్నారు. అరెస్టు జరిగి నెలగడుస్తున్నప్పటికి… ఇంకా ఇక్కడ ఎవరూ ఖండించలేదన్నారు. చంద్రబాబు అరెస్ట్ అంశంపై అక్కా పురందీశ్వరితో టచ్ లో ఉన్నానని కేంద్ర పెద్దలను కలుస్తానని చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో లబ్ధి కోసమే అక్కడ నేతలు మూడు రోజులుగా చంద్రబాబు జపం చేస్తున్నారని చంద్రబాబు అరెస్టు అన్యాయమని అంటున్నారే తప్ప ఒక్కరు కూడా జరిగిన ఘటన గురించి మాట్లాడటం లేదని పరోక్షంగా బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బాబు ద్వారా దేశం లబ్ధి పొందిందని ఆయన అరెస్టును దేశం మొత్తం ఖండించిందని అన్నారు.


