Andhra PradeshHome Page Slider

వరుస సెలవులు కావడంతో పోటెత్తిన తిరుమల

పవిత్రమైన భాద్రపద మాసములో శనివారం రెండో వారం, అక్టోబర్ 2 వరకు వరుస సెలవులు ఉండడంతో తిరుపతిలోని తిరుమలకు వెళ్లే రహదారులన్నీ భక్తుల రద్దీతో నిండిపోయాయి. అలిపిరిలోని పార్కింగ్ స్లాట్‌లు ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం నుండి వచ్చే బస్సులతో అలిపిరి రహదారి వెంట SV వేదిక్ విశ్వవిద్యాలయం వరకు నిలిచి ఉన్నాయి. శుక్రవారం నుంచి అలిపిరి రహదారికి ఇరువైపులా బస్సులు బారులు తీరాయి.

VQC 1, 2, నారాయణగిరి షెడ్‌లలోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. క్యూ లైన్లు నందకం రెస్ట్ హౌస్ దాటి బయట ఐదు కిలోమీటర్లకు పైగా విస్తరించాయి. గురువారం నుంచి క్యూ లైన్లలో బారులు తీరిన భక్తులకు అన్నప్రసాదం, పానీయాలు, తాగునీరు తదితర ఏర్పాట్లు చేసింది టీటీడీ. తిరుపతి నుంచి సీనియర్ అధికారులు కూడా వివిధ ప్రాంతాల్లో సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు రంగంలోకి దిగారు.