లోకేష్ పాదయాత్ర మళ్లీ వాయిదా
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం యాత్ర వాయిదా పడింది. వచ్చే బుధవారం చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై సుప్రీం కోర్టులో వాదనల నేపథ్యంలో యాత్ర వాయిదా వేసుకోవాలని పార్టీ నేతలు లోకేష్ కు సూచించారు. దీంతో ఆయన యాత్రను వాయిదా వేసుకున్నారు. అంతకు ముందు సెప్టెంబర్ 29న యాత్ర పునఃప్రారంభించాలని లోకేష్ భావించారు.

