టీమ్ ఇండియా వరల్డ్ కప్ జట్టు ఇదే..!
2023 వరల్డ్ కప్ టీమ్ ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, BCCI చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. రాబోయే ప్రపంచ కప్ కోసం భారత 15 మంది సభ్యుల జట్టును మంగళవారం వెల్లడించారు. భారత క్రికెట్ జట్టు 2013 నుండి ఏ ICC ట్రోఫీని గెలవలేదు. ఆ కరువును అంతం చేయడానికి స్వదేశంలో జరిగే ODI ప్రపంచ కప్ 2023 అతిపెద్ద అవకాశమని భావిస్తున్నారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 2019 ఫైనలిస్టులు ఇంగ్లండ్- న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. అక్టోబర్ 5, గురువారం నుంచి ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది. ఈ ఈవెంట్ నవంబర్ 19, ఆదివారం అదే వేదికపై ఫైనల్‌తో ముగుస్తుంది.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్

