Home Page SliderNational

మద్యపానం వల్ల జీవితంలో చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాను: హీరోయిన్

మనీషా కొయిరాలా ఒకప్పుడు సినీ ఇండస్ట్రీని ఏలేసిన ప్రముఖ హీరోయిన్. అప్పట్లో అగ్ర హీరోలందరితో నటించి బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నారు. ఈ విధంగా ఆమె కేవలం కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చకున్నారు. అయితే ఆమె తాజాగా తన జీవితంలో జరిగిన కొన్ని  పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సినీరంగంలో ఉన్నప్పుడు మద్యపానం వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డానని మనీషా తెలిపారు. కాగా ఈ మద్యపానం అలవాటు తన జీవితాన్ని తలకిందులు చేసిందన్నారు. దీనివల్ల జీవితంలో ఎన్నో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని ఆమె వెల్లడించారు. గతంలో మనీషా మద్యం మత్తులో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ తర్వాత మనీషా కొయిరాలా క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. కాగా ఆమె క్యాన్సర్‌కు విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకొని తిరిగి కోలుకున్నారు. ప్రస్తుతం ఆమె పలు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలస్తోంది.