Home Page SliderNational

ఆసక్తికరంగా వెంకటేష్ “సైంధవ్” ఫస్ట్ లుక్

విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “సైంధవ్”. అయితే ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. అదేంటంటే ఈ సైంధవ్ సినిమా ఫస్ట్ లుక్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. అయితే ఈ ఫస్ట్ లుక్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. కాగా దీంట్లో వెంకటేష్‌ను ఓ పాపను హత్తుకొని ఉండగా..ఆయన సీరియస్‌గా చూస్తున్నారు. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ ,ఆండ్రియా,రుహాణి శర్మ,నవాజుద్దీన్ లిద్ధిఖీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాాత్రలో నటిస్తోన్న ఈ సినిమా తెలుగుతోపాటు హిందీ,తమిళం,మలయాళం,కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే ఈ ఫస్ట్ లుక్‌ను బట్టి చూస్తే ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.