Home Page SliderInternational

పసిపిల్లలకు విషమిచ్చిన టీచర్‌కు ఉరిశిక్ష

చైనాలోని ఓ కిండర్ గార్డెన్ టీచర్ పసిపిల్లలపై అతి కిరాతక చర్యకు పాల్పడింది. తాను పనిచేసే స్కూల్లో చదువుకునే 25 మంది పిల్లలకు ఆహారంలో విషం పెట్టి చంపేసింది. 2019లో  వాంగ్ యున్ అనే 39 ఏళ్ల ఈ టీచర్ మెంగమెంగ్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ అనే స్కూల్‌లో ఈ దారుణానికి పాల్పడింది. తోటి టీచర్‌తో పోట్లాట పెట్టుకుని, పట్టలేని కోపంతో ఆ టీచర్ క్లాసులోని పిల్లలు తినే ఆహారంలో సోడియం నైట్రేట్‌ను కలిపి అభం శుభం తెలియని పసిపిల్లల మరణానికి కారణమయ్యింది. సమాచారం అందుకుని  ఆమెను అరెస్టు చేసిన పోలీసులు హెనెన్ ప్రోవిన్స్‌లో గల పీపుల్స్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆమెను విచారించిన కోర్టు నేరం రుజువు కావడంతో ఆమెకు ఉరిశిక్ష విధించింది. గురువారం ఈ తీర్పు వెలువడిందని అక్కడి మీడియా వర్గాలు సమాచారమిచ్చాయి.