Home Page SliderNational

యూట్యూబ్‌లో రికార్డు సృష్టిస్తోన్న విజయ్ సాంగ్

దక్షిణాదిలో దళపతి విజయ్‌కు ఉన్న క్రేజ్ ఇంత అంత కాదనే చెప్పాలి. దీంతో ఆయన కొత్త సినిమా నుంచి ఏ అప్‌డేట్ వచ్చిన ఆయన అభిమానులు దానిని ఓ పండగలా భావిస్తారు. ఈ నేపథ్యంలో విజయ్ నటించిన కొత్త సినిమా లియో నుంచి నా రెడీ అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. కాగా ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తూ..రికార్డు సృష్టిస్తోంది. ఈ సాంగ్ విడుదలైన కేవలం 24 గంటల్లోనే 17 మిలియన్ వ్యూస్ సాధించింది.అంతేకాకుండా 1.6 మిలియన్ లైక్స్ సొంతం చేసుకొని ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. దీంతో ఈ సాంగ్ సౌత్ ఇండస్ట్రీలో 24 గంటల వ్యవధిలో అత్యధిక వ్యూస్ సాధించిన మూడో పాటగా నిలిచిందని విజయ్ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. కాగా తొలి రెండు స్థానాల్లో అరబిక్ కుతు(23.77M),రంజితమే (16.68M) పాటలు ఉన్నాయి. అయితే మొదటి రెండు స్థానాల్లో ఉన్న పాటలు కూడా విజయ్ దళపతివే కావడం విశేషం.