Andhra PradeshHome Page Slider

 ఏపీ ఆర్టీసీ ఆస్తులను ఎవరికీ కట్టబెట్టడంలేదు:ఆర్టీసీ ఎండీ

ఇటీవల కాలంలో  ఏపీలో ఆర్టీసీనీ ప్రైవేటీకరణ చేస్తున్నారనే వార్తలు విస్తృతంగా వినిపిస్తున్నాయి.  దీంతో ఏపీ వ్యాప్తంగా ఉన్న  ఆర్టీసీ  ఉద్యోగులు ఆందోళన బాట చేపట్టారు. కాగా దీనిపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరమల రావు స్పందించారు. విజయవాడలో జరిగిన ఆర్టీసీ ఈయూ రాష్ట్ర మహసభల్లో పాల్గొన్న ఆర్టీసీ ఎండీ దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు.  ఆయన మాట్లాడుతూ ఏపీలో ఆర్టీసీ నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం బాగా తగ్గిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఆర్టీసీ  ఆదాయాన్ని పెంచేందుకు లీజుకు మాత్రమే ఇస్తున్నామని..దానిని ఎవరికి కట్టబెట్టడం లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీనీ లీజుకు ఇవ్వడం ద్వారా సంస్థకు ఆదాయం లభిస్తుందని ఆర్టీసీ ఎండీ తెలిపారు. అంతేకాకుండా ఆదాయం పెరిగితే ఆర్టీసీకి మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. మరోవైపు ఖర్చులు తగ్గించడం ద్వారా అప్పుల్లో కూరుకుపోయిన ఆర్టీసీకి కాస్త ఉపశమనం కలుగుతుందన్నారు.