జీ-20 సమ్మిట్‌లో ‘రామ్‌చరణ్’
శ్రీనగర్‌లో జరగనున్న జీ-20 సమ్మిట్‌లో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీనగర్ చేరుకున్నారు. RRRతో గ్లోబల్ స్టార్‌గా మారిన రామ్‌చరణ్ నేడు సినిమా ఇండస్ట్రీకి ప్రతినిధిగా ఈ సమ్మిట్‌లో పాలుపంచుకోనున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ షూటింగులకు కాశ్మీర్‌లో గల అవకాశాలను ఈ సమ్మిట్‌లో చర్చించే అవకాశం ఉంది. కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నలుపు రంగు షర్ట్‌తో కనిపించారు రామ్ చరణ్. శ్రీనగర్‌కు చేరుకుని ఈ జీ-20 సమావేశంలో భాగం కానున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలోని ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో బిజీగా ఉన్నారు రామ్‌చరణ్. ఈ చిత్రంలో కైరా అధ్వాణీ కధానాయికగా నటిస్తోంది. తమన్ సంగీతదర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం అనంతరం బుచ్చిబాబు దర్శకత్వంలో కొత్త సినిమాలో నటించబోతున్నారు చరణ్.

