Home Page SliderNational

గెట్ వెల్ సూన్ విరాట్

ఈ IPL సీజన్ త్వరలోనే ముగింపు దశకు చేరుకోబోతుంది. ఈ క్రమంలో ప్లేఆఫ్స్‌లో చోటు సంపాదించుకునేందుకు ప్రస్తుతం ఉన్న  IPL జట్టులన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.  కాగా నిన్న జరిగిన GT VS RCB మ్యాచ్‌లో ఇరు జట్టులు పోటాపోటీగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్,బెంగుళూరు ప్లేయర్ విరాట్ కోహ్లీ  ఇద్దరు  సెంచరీలతో అదరగొట్టారు. కాగా ఈ మ్యాచ్‌లో బెంగుళూరుపై గుజరాత్ విజయం సాధించింది. దీంతో విరాట్ సెంచరీ చేసినప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది.ఈ నేపథ్యంలో కింగ్ కోహ్లీ మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు  తెలుస్తోంది. దీనికి కారణం తాజాగా జరిగిన మ్యాచుల్లో విరాట్ వరుసగా సెంచరీలు చేయడమే. అంతేకాకుండా కోహ్లీ చురుగ్గా ఫీల్డింగ్‌లో పాల్గొనడంతో.. మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. దీని కారణంగానే నిన్నటి మ్యాచ్ చివరి ఓవర్లో డగౌట్‌కి వచ్చి కూర్చున్నాడని హెడ్ కోచ్ సంజయ్ బంగర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఫిజియో చేశాకే కాస్త ఉపశమనం పొందాడని తెలిపారు. దీంతో ఇది విన్న కోహ్లీ ఫ్యాన్స్ గెట్ వెల్ సూన్ ఛాంప్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.