ఇప్పుడే ఎన్నికలు జరిగినా 95-105 స్థానాల్లో గెలుస్తాం..
ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్‌ఎస్ 95 స్థానాల నుండి 105 స్థానాల్లో గెలవడం ఖాయమని తెలంగాణ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని దశాబ్దకాలంలో శతాబ్ధి అభివృద్ధి చేశామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. సర్వేలు అన్నీ కూడా తమకు అనుకూలంగా ఉన్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.

