RCB కెప్టెన్ ధోని అయితే బాగుండేది
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ క్రికెట్ దిగ్గజం ధోనీపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం IPL మేనియా నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ IPL సీజన్ జట్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. IPL లో RCB కెప్టెన్ ధోని అయ్యివుంటే ఆ జట్టు 3 టైటిళ్లను తన ఖాతాలో వేసుకునేదన్నారు. కాగా బెంగుళూరు జట్టుకి స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించినప్పటికీ..ధోని మాయ ప్రత్యేకమని చెప్పారు. అయితే ధోని బయటకు ఎప్పుడు కామ్‌గా కనిపిస్తుంటారు. అయినప్పటికీ ఆయన మదిలో మ్యాచ్ ప్రణాళికలు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయన్నారు. కాగా ధోని సారధిగా వ్యవహరించిన CSK టీమ్ IPL లో ఇప్పటివరకు 4 సార్లు టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో బెస్ట్ క్రికెటర్‌గానే కాకుండా బెస్ట్ కెప్టెన్‌గా కూడా ధోని పేరు సంపాదించుకున్నారు. అంతేకాకుండా ధోని కెప్టెన్ కూల్‌గా దేశవ్యాప్తంగా ఎన్నో లక్షలమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

