Andhra PradeshHome Page Slider

బెజవాడ కనకదుర్గమ్మకు 20 లక్షల విలువైన వజ్రాల హారం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మకు రూ.20 లక్షల విలువైన హారం మంగళవారం కానుకగా అందింది. హైదరాబాద్‌కు చెందిన సీఎం రాజేష్‌, ప్రకృతి దంపతులు రూ.20 లక్షల విలువచేసే వజ్రాలు పొదిగిన 180 గ్రాముల బంగారు హారాన్ని అమ్మవారి అలంకరణ నిమిత్తం ఈవో భ్రమరాంబకు అందజేశారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వారికి శేషవస్త్రం, ప్రసాదం, ఆశీర్వచనం అందజేశారు.