గూగుల్‌ను భయపెడుతున్న “ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్”
ప్రముఖ కంపెనీలను సైతం పక్కకు నెట్టి సెర్చ్ ఇంజిన్‌లో ప్రపంచాన్ని ఏలుతున్న గూగుల్ కూడా ప్రస్తుతం భయపడుతుంది. దానికి ప్రధాన కారణం ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్‌కు డిమాండ్ అమాంతం పెరిగిపోతుంది. అయితే ఇది ఏమాత్రం హర్షించదగ్గ విషయం కాదని ప్రపంచంలోని పలువురు ప్రముఖులు హెచ్చరిస్తున్నారు. కాగా ఈ జాబితాలో AI గాడ్‌ఫాదర్‌గా గుర్తింపు పొందిన జెఫ్రీ హింటన్ కూడా చేరారు. ఈయన ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ సిస్టమ్స్‌కు ఫౌండేషన్ టెక్నాలజీని క్రియేట్ చేశారు. జెఫ్రీ హింటెన్ ఛీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్‌గా గూగుల్‌లో విధులు నిర్వహించారు. కాగా ఆయన ఇటీవల గూగుల్‌కు రాజీనామా చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్‌తో సమాజానికి, మానవాళికి పెను ప్రమాదం పొంచివుందని తెలియజేసేందుకే రాజీనామా చేసినట్లు జెఫ్రీ హింటెన్ వెల్లడించారు. ఈ మధ్య కాలంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చయ్ కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ వల్ల భవిష్యత్తులో తలెత్తబోయే సమస్యలను తలచుకుంటే రాత్రులు నిద్రపట్టడం లేదని తెలిపారు.

