Home Page SliderInternational

ప్రియాంకా చోప్రా నెక్లెస్ ధర తెలిస్తే మూర్చపోతారు

మొన్నటి మెడ్ గాలా అంతర్జాతీయ  ఫ్యాషన్ వేడుకలో  బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంకచోప్రా అందాల వజ్రాల నెక్లెస్‌తో హొయలొలికింది. వేదికపై ఆ హారం చూసి అందరూ కళ్లప్పగించారు. నలుపు, తెలుపు గౌనుతో వజ్రాల హారంతో మెరిసిపోయింది ప్రియాంక. దాని ధర తెలుసుకుంటే మనకు మూర్చవచ్చినంత పనవుతుంది. దీనిధర 204 కోట్ల రూపాయలుంటుందట. దీనిని ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థ బల్గరీ 11.6 క్యారట్ల వజ్రాలతో రూపొందించింది. దీనిధర 25 మిలియన్ డాలర్లు అని వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అంటే రూపాయలలో 204 కోట్ల రూపాయలన్నమాట. దీనిని వేలం వేస్తారని వార్తలు వస్తున్నాయి.

ఈ వేడుకను న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో నిర్వహించిన ఈ వేడుకలో బాలీవుడ్‌కు చెందిన అలియా భట్, అంబానీ కుమార్తె ఈశా అంబానీ వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ప్రపంచ నలుమూలలకు చెందిన మోడల్స్, తారలు ఈ వేడుకలో పాల్గొన్నారు.