విశాఖలో 2 వేల రూపాయల నోట్లమార్పిడి కలకలం
విశాఖలో 2 వేల నోట్ల రూపాయల మార్పిడి మోసంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2 వేల రూపాయల నోట్లకు 10 శాతం కమీషన్‌తో ఐదువందల రూపాయల నోట్లిస్తామంటూ ఆశ చూపి 12 లక్షల రూపాయలతో ఉడాయించారు ఒక ముఠా. ఈ ముఠా బాధితుడు సురేష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన గంగా భవానీ అనే మహిళతో ట్రాప్ చేయించారు ఈ ముఠా. వీరిని ఒక హొటల్లో సీసీ టీవీ ఫుటేజ్‌లో గుర్తించారు పోలీసులు. ఈ కేసులో గంగాభవానీ కోసం అన్వేషిస్తున్నారు. సురేష్ నోట్ల మార్పిడి చేసుకోవడానికి గల కారణాలను కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు.

