అమెరికాలో దివాలా దారిలో మరోబ్యాంకు
అమెరికాలో దివాలా దారిలోకి ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకు చేరబోతోంది. యూఎస్‌లో దివాలా తీసిన మూడవ బ్యాంకుగా మారింది ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకు. అత్యధిక డిపాజిట్లు కల సంపన్నులు తమ డిపాజిట్లను ఈ బ్యాంకు నుండి ఉపసంహరించుకోవడంతో ఈ ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకు దివాలా స్థితికి చేరుకుంది. అయితే ఈ బ్యాంకును జేపీ మోర్గాన్ సంస్థ కొనుగోలు చేసింది. దీనితో యూఎస్‌కు చెందిన 10 శాతం కంటే ఎక్కువ డిపాజిట్లు జేపీ మోర్గాన్‌కు రానున్నాయి. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకుకు ఉండే 8 రాష్ట్రాలలోని 84 బ్రాంచిలు ఇకనుంచి జేపీ మోర్గాన్ బ్రాండ్ కింద ఓపెన్ కాబోతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకుకు 200 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు, 144 బిలియన్ డాలర్ల విలువైన డిపాజిట్లు ఉన్నాయి. ఈ మొత్తం డిపాజిట్లు, ఆస్తులు జేపీ మోర్గాన్ కిందకు రాబోతున్నాయి.