InternationalTelangana

‘సోదరి అంత్యక్రియలు చేయనివ్వండి’ కేటీఆర్‌కు హైదరాబాదీ విన్నపం

బ్రిటన్‌లో చనిపోయిన సోదరి అంత్యక్రియల కోసం కేటీఆర్‌ సహాయం అడిగిందో అమ్మాయి. బ్రిటన్‌లో ‘ఏరోనాటిక్స్‌ అండ్ స్పేస్ ఇంజనీరింగ్‌’లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న సాయి తేజస్వి ఏప్రిల్ 11న బ్రిగ్టన్ బీచ్‌లో సముద్రకెరటాలకు కొట్టుకునిపోయి మరణించింది. అప్పటి నుండి ఆమె భౌతికదేహం అక్కడి హాస్పటల్‌లో ఉంది. ఆమె శరీరాన్ని ఇక్కడకు రప్పించి అంత్యక్రియలు నిర్వహించడానికి వారి కుటుంబం శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా 20 వేల పౌండ్లు సంపాదించారు. దీనితో ఆమెను రప్పించడానికి సహాయ పడాలని ఆమె సోదరి తెలంగాణా మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ, వారి కుటుంబానికి జరిగిన నష్టానికి బాధపడుతూ, తప్పకుండా అక్కడి బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్‌తో మాట్లాడి ఆమె సోదరి భౌతికకాయాన్ని రప్పిస్తామని బదులిచ్చారు.