Home Page SliderNational

ప్లీజ్ మోదీజీ… వైరల్ అవుతున్న జమ్ము విద్యార్థిని వీడియో సందేశం

చిన్నారి సీరత్ నాజ్ తన పాఠశాలలో స్నేహితులతో కలిసి అపరిశుభ్రమైన నేలపై కూర్చోవలసి వచ్చినందుకు సంతోషంగా లేనంటూ ప్రధాని మోదీకి వీడియో సందేశం పంపించింది. తన స్కూల్ కోసం మోదీ ఏదైనా చేయాలని కోరింది. ఫేస్‌బుక్‌లో ఇప్పుడు ఈ వీడియో వైరల్‌ అవుతోంది. జమ్మూ, కశ్మీర్‌లోని కతువా జిల్లాలోని లోహై-మల్హర్ గ్రామానికి చెందిన బాలిక, ప్రధాని నరేంద్ర మోదీకి తమ స్కూలుకు సంబంధించి విజ్ఞప్తిని ఇలా వెరైటీగా పంపించింది. “దయచేసి మోదీజీ, ఏక్ అచీ సి స్కూల్ బన్వా దో నా (దయచేసి మోదీజీ, మా కోసం ఒక మంచి పాఠశాలను నిర్మించండి)” అంటూ వేడుకొంది. జమ్మూ, కశ్మీర్‌కు చెందిన ‘మార్మిక్ న్యూస్’ అనే పేజీ ద్వారా ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఈ వీడియో 20 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. లక్షా 16 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. యువ పాఠశాల విద్యార్థిని తనను తాను స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిగా పరిచయం చేసుకోవడం ద్వారా కేవలం 5 నిమిషాల కంటే తక్కువ రన్‌టైమ్ ఉన్న వీడియో ద్వారా అభ్యర్థన తెలిపింది.