Home Page SliderTrending Today

150 మంది చిన్నారులను దత్తత తీసుకున్న ప్రముఖ హీరో

సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడు ముందు ఉండే హీరో లారెన్స్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. లారెన్స్  ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ..ఎంతోమంది అనాథల జీవితాలలో వెలుగులు నింపారు.  అయితే ఆయన తాజాగా 150 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకొని మరోసారి వార్తల్లో నిలిచారు. వారి చదువుకు భవిష్యత్తుకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈయన కొత్త సినిమా రుద్రన్ ఆడియో ఫంక్షన్‌లో దత్తత తీసుకున్న పిల్లలతో కలిసి దిగిన ఫోటోని లారెన్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీనికి తన అభిమాన ఆశీస్సులు కావాలని లారెన్స్ కోరారు. అయితే చెన్నైలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చిన్నారులు ఎవరైనా..ఆర్థిక సమస్యలతో చదువుకు దూరమవుతున్నా అలాంటి వారికి తాము అండగా ఉంటామని లారెన్స్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఏ చిన్నారులకైనా గుండె శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఏర్పడిన లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్‌ను సంప్రదించాలని లారెన్స్ విజ్ఞప్తి చేశారు.