పొంగులేటి, జూపల్లిని సస్పెండ్ చేసిన టీఆర్ఎస్
బీఆర్‌ఎస్ పార్టీ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇద్దరు బీఆర్‌ఎస్ నాయకులను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. వీరిద్దరూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని వీరిద్దరినీ చాలా సీరియస్‌గా తీసుకున్నారు కేసీఆర్. ఆత్మీయ సమ్మేళనాలలో వీరు మాట్లాడిన మాటలే ఈ సంఘటనకు కారణమని చెప్పవచ్చు. ‘బీఆర్‌ఎస్ పేరుతో చెత్తపాలన దేశానికి ఇస్తారా.. తెలంగాణాను దోచుకున్నది చాలదా దేశాన్ని వదిలేయమన్న’ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. ‘తెలంగాణాలో ప్రజాస్వామ్యం ఎప్పుడో గాడి తప్పిందంటూ’ ఘాటు వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిని పార్టీ సస్పెండ్ చేసింది. ‘ఇక కేసీఆర్ శకం ముగుస్తోందంటూ’ నేరుగా కేసీఆర్ పైనా, ఆయన కుటుంబం పైనా సెటైర్లు వేశారు పొంగులేటి. ఈయన పార్టీ రెబల్ నాయకులందరినీ ఏకం చేస్తున్నారని అధిష్టానం గుర్రుగా ఉంది. బీఆర్‌ఎస్ పార్టీకి సంబంధించి ఇది చాలా కీలక పరిణామం అనే చెప్పాలి.


