Andhra PradeshHome Page Slider

పెయింట్ డబ్బా పేలి ముక్కలైన వ్యక్తి

అనంతపురం ఆర్‌టీవో ఆఫీస్ వద్ద పేలుడు జరిగింది. పెయింట్ డబ్బా పేలి ఒక వ్యక్తి ముక్కలు గా ఎగిరిపడ్డాడు. ఇస్మాయిల్ అనే వ్యక్తి పెయింట్ గోడౌన్‌లో ఉన్న పెయింట్ డబ్బాను తెరవడానికి ప్రయత్నించాడు. దానితో అది బాగా పెద్ద శబ్ధంతో పేలి,అతనిపై పడడంతో 30 అడుగుల దూరంలో ఎగిరిపడ్డాడు. అతని శరీరం చిధ్రమై ముక్కలు ముక్కలుగా మారిపోయింది. ఈ పెయింట్ గొడౌనును పదేళ్ల క్రితమే మూసేశారని, ఇప్పుడు దానిని లీజుకు ఇస్తూ రిపేర్లు చేయడానికి చూస్తున్నట్లు తెలిసింది. ఆ పెయింట్ ఏంటో, కెమికల్ ఏంటనే విషయం ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని తెలిసింది.