తెలంగాణా ప్రభుత్వాన్ని రద్దు చేయాలి: రేవంత్రెడ్డి
తెలంగాణాలో ఇటీవల కాలంలో వరుసగా ప్రశ్నా పత్రలు లీక్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో TPCC చీఫ్ రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర పరిపాలనను గాలికి వదిలేసి రాజకీయ విధ్యంసంలో మునిగిపోయారన్నారు. అందువల్లే దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణాలో ప్రశ్నాపత్రాలన్నీ లీకవుతున్నాయని ఆయన ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. తెలంగాణాలో పదవతరగతి మొదలు ,TSPSC వరకు అన్ని వ్యవస్థలు కుప్పకూలాయన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని లక్షలాదిమంది విద్యార్థులు,నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సీఎంకి కనీసం ఒక్కరోజు కూడా ఆ పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రద్దు చేయాల్సింది పరీక్షలను కాదు..కేసీఆర్ ప్రభుత్వాన్నే రద్దు చేయాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు.

