Home Page SliderTrending Today

రామ్‌చరణ్ బర్త్‌డే రోజు చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్  చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైయ్యారు. కాగా 2022లో రిలీజైన RRR మూవీతో ఆయన గ్లోబల్ స్టార్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందారు. తనదైన యాక్టింగ్ ,డ్యాన్స్,డైలాగులతో అదరగొట్టే రామ్‌చరణ్..ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. రామ్‌చరణ్ మగధీర,రచ్చ,నాయక్,ఎవడు,రంగస్థలం,ధృవ, RRR వంటి సూపర్‌హిట్ సినిమాలతో టాలీవుడ్ టాప్‌హీరోగా ఎదిగారు. అయితే ఈరోజు గ్లోబల్‌స్టార్ పుట్టినరోజు దీంతో ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా  మెగాస్టార్ చిరంజీవి తన తనయుడు రామ్‌చరణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. “నాన్న నిన్ను చూసి గర్విస్తున్నా” హ్యాపీ బర్త్‌డే అని చరణ్‌కు ముద్దు పెడుతున్న ఫోటోను చిరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.