Home Page SliderNational

ఆస్ట్రేలియాతో నాలుగో టెస్ట్ డ్రా, భారత్ సీరిస్‌ విజయం

2-1తో విజయం సాధించిన టీమిండియా
తొలి రెండు టెస్టుల్లో రోహిత్ సేన గెలుపు
మూడో టెస్టులో స్మిత్ సారధ్యంలో ఆసీస్ విజయం

అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఇండియా-ఆస్ట్రేలియా నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను టీమ్ ఇండియా 2-1తో కైవసం చేసుకుంది. ఇవాళ ఐదో రోజు ఆట మొదలుపెట్టిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు ట్రావిస్ హెడ్, మాథ్యూ కుహ్నెమాన్లో… 6 పరుగులకు కుహ్నెమాన్‌ను అశ్విన్ ఓట్ చేశాడు. ఆ తర్వాత క్రీజ్ లో అడుగు పెట్టిన మార్నస్ లాబుస్‌చాగ్నే హెడ్‌తో కలిసి ఆచితూచి ఆడారు. 90 పరుగుల వద్ద హెడ్‌ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. స్టీవ్ స్మిత్ 10 పరుగులతో, లాబుస్‌చాగ్నే 63 తో నాటౌట్ గా నిలిచారు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 480, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులు సాధించింది. మ్యాచ్ ఫలితం రాదన్న భావనతో ఇరు జట్లు మ్యాచ్ డ్రాకు అంగీకరించాయి.

27వ టెస్టు సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. 108వ టెస్టు ఆడుతున్న కోహ్లీ టెస్టు క్రికెట్‌లో 10వ సారి మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. ఎనిమిదో టెస్ట్ డబుల్ సెంచరీని కోల్పోయినప్పటికీ, కోహ్లి ఇన్నింగ్స్ ద్వారా తనలో సత్తా తగ్గలేదని నిరూపించుకున్నాడు.

courtesy bcci tv

భారత్‌లో జరుగుతున్న టెస్టు సిరీస్‌కి సంబంధించి అరుదైన నిర్ణయంతో, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుకు ఇద్దరు విజేతలను ప్రకటించాలని ప్యానెల్ నిర్ణయించింది. సోమవారం అహ్మదాబాద్‌లో భారత ఆల్‌రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ట్రోఫీని పంచుకున్నారు. టెస్టు ఫార్మాట్‌లో అశ్విన్‌కి 10వ అవార్డు ఐతే, జడేజాకు ఇదో రెండో అవార్డు. టెస్ట్ క్రికెట్‌లో 15 నెలల తర్వాత మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు అశ్విన్. యాదృచ్ఛికంగా, జడేజాకి గతంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2017లో మ్యాన్ ఆఫ్ ద సీరిస్ అవార్డు లభించింది. అశ్విన్ వరుసగా 17.28 రేట్‌తో 25 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. జడేజా 22 వికెట్లు పడగొట్టాడు.

courtesy bcci tv

సోమవారం జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో శ్రీలంక ఓడిపోవడంతో టీమిండియా ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌లోకి అర్హత పొందింది.