Home Page SliderTelangana

ఢిల్లీలో కవిత.. హైదరాబాద్‌లో బీజేపీ.. పోటాపోటీ దీక్షలు

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. కవిత రేపు జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన దీక్షకు మొదటి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే తర్వాత బీఆర్ఎస్ నాయకులు వెళ్లి మాట్లాడటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కవిత దీక్షకు పెద్ద ఎత్తున మహిళలు హాజరవుతారని భావిస్తున్నారు. 6 వేల మంది కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగుతోంది. తెలంగాణ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవధి రాథోడ్ దీక్షలో పాల్గొంటారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ దీక్షకు కౌంటర్‌గా తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా దీక్షకు దిగుతోంది. తెలంగాణలో బెల్టు షాపులు, మహిళలపై హత్యలు, అత్యాచారాలు నిరసిస్తూ పార్టీ నేతలు దీక్షకు దిగుతున్నారు. ఈ దీక్షలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతోపాటుగా పార్టీ ముఖ్యులు పాల్గొంటారు. ఈ దీక్షలో బీజేపీ నేతలంతా పాల్గొనాలని పార్టీ చీఫ్ బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగుతుంది.