ఆస్కార్ ఒలింపిక్ బంగారు పతకంతో సమానమన్న రామ్ చరణ్
కేవలం నటులకే కాదు, భారతదేశం ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలుచుకున్నట్లే, నేను పరుగెత్తను కానీ నా భారతీయ క్రీడాకారుడు ఆ పతకాన్ని అందుకున్నప్పుడు మాత్రమే అనుభూతి చెందుతాను, ఆస్కార్ మాకు ఒలింపిక్ బంగారు పతకంతో సమానమన్నారు రామ్ చరణ్. ఆస్కార్‌కి సిద్ధమవుతున్న తరుణంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వివిధ అంశాలపై టాక్ ఈజీకి చెందిన సామ్ ఫ్రాగోసోతో మాట్లాడాడు. RRR వంటి చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నాడు. రికార్డులను బద్దలు కొట్టి, భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ప్రపంచ వేదికపై గుర్తింపు తెచ్చిపెట్టడం గర్వంగా ఉందన్నాడు. RRR అనేది ఇక్కడి వరకు రావడానికి ఒక వేదికయ్యిందన్నాడు. గత 85 ఏళ్లుగా భారతదేశంలోని సినీ పరిశ్రమలోని కష్టపడి పనిచేసే దర్శకులు, ప్రజలు చూడాలనుకున్న ఘట్టమన్నాడు. ప్రపంచ వేదికపై గుర్తింపు పొందడమే అంతిమ లక్ష్యమన్నాడు. 95వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా నామినేట్ అయిన నాటు నాటు పాట గురించి కూడా రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.
బిజీ షెడ్యూల్ మధ్య, రామ్ తన భార్య ఉపాసన కొణిదెలను ఇటీవల బేబీమూన్ ట్రిప్‌కి తీసుకెళ్లాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె వీడియోను షేర్ చేశారు. స్నీక్ పీక్ #బేబీమూన్# హ్యాపీ హోలీ… అంటూ రాసుకొచ్చారు. ఇద్దరూ కలిసి లాంగ్ డ్రైవ్, కొంత నాణ్యమైన సమయాన్ని గడిపినట్టు ఉపాసన రాసుకొచ్చారు. రామ్ చరణ్ జంట తిమింగలం, డాల్ఫిన్‌లను చూడటానికి కూడా వెళ్లారు.

