బీబీసీపై ఐటీ రెయిడ్స్, యూకే మంత్రికి జైశంకర్ దిమ్మతిరిగే సమాధానం
ఇటీవల ఇండియాలో బీబీసీ కార్యాలయాల్లో ఐటీ శాఖ తనిఖీలపై ఆ దేశ విదేశాంగ మంత్రి జేమ్స్, ఇండియా విదేశాంగ మంత్రి జైశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. గత నెలలో న్యూఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో భారత పన్ను అధికారులు సోదాలు నిర్వహించారు. బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్ బీబీసీ పన్ను శోధనల అంశాన్ని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో బుధవారం జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో తెలివిగా లేవనెత్తారని మంత్రి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఐతే బీబీసీ కార్యాలయంలో ఐటీ శాఖ సర్వే వ్యవహారంపై యూకే మంత్రికి కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తిరుగులేని సమాధానం ఇచ్చారు. తాజాగా జైశంకర్‌తో భేటీ అయిన యూకే మంత్రి… BBC పన్ను ‘సర్వే’ అంశాన్ని లేవనెత్తారు. ఐతే ఇండియాలో ఉన్న అన్ని సంస్థలు తప్పనిసరిగా చట్టాలను పాటించాల్సిందేనన్నారు జైశంకర్. గత నెలలో న్యూఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో పన్ను అధికారులు సోదాలు నిర్వహించారు. 2002లో జరిగిన అల్లర్ల సమయంలో గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై బ్రిటిష్ బ్రాడ్‌కాస్టర్ రూపొందించిన డాక్యుమెంటరీపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆ తర్వాత బీబీసీ కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. బీబీసీ డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించింది కూడా.


