Andhra PradeshHome Page Slider

వివేకా రెండో పెళ్లి విషయాన్ని సీబీఐ ఎందుకు విచారించట్లేదు!

వివేకా హత్య విషయంలో సీబీఐ విచారణ పేరుతో డ్రామా జరుగుతోందని విమర్శించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబులా తాము వ్యవస్థలను మేనేజ్ చేయడం లేదన్నారు. చంద్రబాబు చెప్పినట్టుగా సీబీఐ కింది స్థాయి అధికారులు పనిచేస్తున్నారన్నారు. వివేక చుట్టూ నేరప్రవృత్తి ఉన్నవారు ఉన్నారని… ఆయనకు ఎవరి నుంచైనా ముప్పు ఉండొచ్చన్నారు. రెండో పెళ్లి విషయాన్ని సీబీఐ ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు సజ్జల. సీబీఐ ఆ కోణంలో కూడా విచారించాలన్నారు. వివేకా హత్య కేసులో జగన్ పేరు తీసుకురావాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకాను దారుణంగా చంపినవారికి కఠిన శిక్ష పడాలన్న సజ్జల కుట్ర వెనుక ఉన్న కుట్రదారులను శిక్షించాలన్నారు.