Andhra PradeshHome Page Slider

ముహూర్తం పెడతాం.. ఎంత మంది వస్తారో రండి.. చంద్రబాబు సవాల్

వైసీపీ నేతలు బరితెగించి దాడులకు తెగబడుతున్నారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. గన్నవరంలో రౌడీలు, సైకోలు, స్వైరవిహారం చేస్తున్నారన్నారు. చరిత్రలో చాలా మంది రౌడీలను చూశామన్నారు. వారందరూ కాలగర్భంలో కలిసిపోయారన్నారు. పోలీసుల పని పోలీసులు చేయాలన్నారు. ఎందుకో కొందరు వింత చేష్టలు చేస్తున్నారన్నారు. ఎందుకలా చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదన్నారు. జగన్ సర్కారు, పోలీసులతో తప్పుడు పనులు చేయిస్తోందన్నారు. జగన్‌ను నమ్ముకున్నోళ్లంతా జైలుకు పోయారన్నారు. రాష్ట్ర ప్రజల కోసం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. బెదిరిస్తే బయపడిపోయేది టీడీపీ కాదన్నారు. పార్టీ కోసం ప్రాణాలు ఒడ్డైనా పనిచేసే కార్యకర్తలు, నాయకులున్నారన్నారు చంద్రబాబు. ప్రజల ప్రాణాలకు టీడీపీ రక్షణగా ఉంటుందన్నారు. కావాలంటే లగ్నం పెడతాం.. మీరెంత మంది వస్తారో చూస్తాం.. దొంగ దెబ్బ మాత్రం తీయొద్దన్నారు. దొంగ ఆటలు ఆడొద్దన్నారు. పోలీసులను వదిలిపెట్టి రావాలని వైసీపీ నేతలను చంద్రబాబు కోరారు. పోరాటానికి సైకో కూడా రావాలన్నారు. ఇదంతా బాధతో, ఆవేదనతో చెప్తున్నానన్నారు చంద్రబాబు.