Home Page SliderTelangana

పెట్రోల్‌ పన్నులో సామాన్యుడిపై స్టేట్ దోపిడి?

ఒక లీటర్ పెట్రోల్ పోసుకుంటే కేంద్రానికి కట్టే పన్ను 19.55 పైసలైతే… రాష్ట్ర ప్రభుత్వానికి కట్టే పన్ను 37 రూపాయలని లెక్కలు చెప్పారు ఈటల. మన డబ్బులతో వాళ్లు సోకులు చేస్తూ రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా మార్చిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. 24 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో మద్యం మీద 30 వేల కోట్ల ఆదాయం వస్తే.. నాలుగు కోట్లున్న తెలంగాణలో 45 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్నారు. డబుల్ బెడ్‌ రూమ్‌లు ఇంకెప్పుడిస్తారని ఈటల ప్రశ్నించారు. 57 ఏళ్లు నిండినవాళ్లకు పింఛన్లు ఇచ్చేదెప్పుడన్నారు? చార్‌ధామ్ వెళ్లి బాంబులు పేలితే కాలు విరిగిపోయిందని…దరఖాస్తు పెట్టుకున్నా సదరం సర్టిఫికెట్ రాలేదన్నారు. పెన్షన్ ఇవ్వలేదన్నారు. ఇవన్నీ అడిగితే అసెంబ్లీలో నన్ను ఏమన్నారో చూశారా? అంటూ ప్రశ్నించారు ఈటల. ఈటల రాజేందర్‌కి కళ్ళు కనిపించట్లేదు, కంటి వెలుగు కార్యక్రమంలో ఆపరేషన్ చేయిస్తానన్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నానన్నారు. మరి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వచ్చాయా అంటూ గ్రామస్తులను ఈటల ప్రశ్నించారు. 24 గంటల కరెంటు వస్తుందా? అన్నారు.

40 కిలోల బస్తాకు రెండు కేజీల వడ్లు కట్ చేస్తున్నారని, స్పీకర్ చైర్లో కూర్చున్న జిల్లా ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే… తమ దగ్గర ఎలాంటి పద్ధతి లేదన్నాడన్నారు ఈటల. కేసీఆర్, మహిళలకి వడ్డీలేని రుణాల కింద 4200 కోట్లు బాకీ పడ్డాడన్నారు ఈటల. బీజేపీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ కంటే మేరుగ్గా పాలన ఉంటుందన్నారు. వాళ్ళకంటే గొప్పగా పాలించే నైపుణ్యం బీజేపీకి ఉందన్నారు. బీఆర్ఎస్ నేతల్లా… భూములు అమ్ముకునే నైపుణ్యం లేకపోవచ్చన్నారు ఈటల. బెల్ట్ షాపులు పెట్టి మద్యం అమ్ముకునే నైపుణ్యం లేకపోవచ్చు, వాళ్ల లాగా మోసం చేసి డబ్బులు సంపాదించుకొని నైపుణ్యం లేకపోవచ్చు, కానీ కన్నీళ్లకు పరిష్కారం చూపించే నైపుణ్యం బీజేపీ దగ్గర ఉందన్నారు ఈటల. పేదల ఆకలికి పరిష్కారం చూపించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు. పెన్షన్లు, డబ్బులు బెడ్ రూమ్, రైతు బందు, రైతు బీమా ఇంకా పేదవాళ్లకు మరిన్న పథకాలవు పెట్టుకుందామన్నారు ఈటల. కౌలురైతులను కూడా ఆదుకుంటామన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం కంటే గొప్పగా పని చేసి చూపిస్తాం… నిండు మనసుతో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలన్నారు ఈటల రాజేందర్.