పవన్ అనుభవం పెరుగుతోందన్న కన్నా లక్ష్మీనారాయణ
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై ప్రశంసల జల్లు కురిపించారు ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ… పవన్ కళ్యాణ్ అనుభవజ్ఞుడైన నాయకుడని ఇప్పటికే రెండు ఎన్నికల్లో పోరాడిన అనుభవం ఉందని ప్రజల సమస్యలు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాడితే సీఎం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. జనసేనపై ఇతరుల ప్రభావం ఉండకూడదనేది తన అభిప్రాయం అని తెలిపారు. ఇటీవల జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్, కన్నాలక్ష్మీనారాయణతో సుదీర్ఘంగా చర్చించారు. ఆయన జనసేన పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ మార్పు విషయంలో కన్నా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు వ్యవహారశైలిపై ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పవన్ కల్యాణ్ రాజకీయంగా వేస్తున్న అడుగులను కన్నా అభినందించడంతో.. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ కార్యకర్తల్లో ఉంది.


