తారకరత్న ఆరోగ్యంపైనా నీచ రాజకీయాలు చేస్తారా?
నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైన నేపథ్యంలో ఏపీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. డ్యాన్సులు, బూతులు తప్ప మంత్రి రోజాకు ఏం తెలుసని ప్రశ్నించారు. తారకరత్న ఆరోగ్యంపై వైసీపీ నీచ రాజకీయాలు సిగ్గుచేటు అని అన్నారు. బాబాయ్‌ని చంపినవారికి ఇలాంటి క్షుద్ర రాజకీయాలు కొత్త కాదన్నారు. లోకేష్ పాదయాత్రపై వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారని మంతెన మండిపడ్డారు. లోకేష్ పాదయాత్ర పోస్టర్ రిలీజ్ చేస్తే 8 మంది చనిపోయారని, కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభిస్తే తారకరత్నకు గుండెపోటు వచ్చిందని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ ఐరన్ లెగ్, సైకో అని, ఇప్పుడు పాదయాత్రతో రాష్ర్ట ప్రజలు భయపడుతున్నారని రోజా ఎద్దేవా చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహించారు.

