Home Page SliderTelangana

కరీంనగర్‌లో 10 ఎకరాల స్థలంలో టిటిడి ఆలయం

కరీంనగర్‌లో టిటిడి 10 ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయం నిర్మించడానికి తలపెట్టిందని టిటిడి ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చే విరాళాలతో వెనుకబడిన ప్రాంతాల ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్ధరణ వంటి చర్యలు చేపడుతున్నామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దళారి వ్యవస్థ చాలావరకు అరికట్టామన్నారు.

వైకుంఠఏకాదశి 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం ద్వారా 6 లక్షల మంది దర్శనం చేసుకున్నారని, హుండీ ఆదాయం 10 రోజులకు 39.4 కోట్ల రూపాయలు వచ్చిందన్నారు. ఈనెల 28న రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయబోతున్నామని ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.