తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుకగా ‘వందేభారత్’ ఎక్స్ ప్రెస్
– మొదటి రోజు మాత్రమే 21 స్టేషన్లలో ఆగనున్న ‘వందే భారత్’ ఎక్స్ ప్రెస్
– రెండో రోజు నుంచి కేవలం నాలుగు స్టేషన్లలోనే హాల్ట్
తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుకగా జనవరి 15న (ఆదివారం) ‘వందేభారత్’ ఎక్స్ ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, జి.కిషన్ రెడ్డి పాల్గొంటారు. కాగా, మొదటి రోజు అంటే జనవరి 15 నాడు ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొదలుకుని, చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మథిర, కొండపల్లి, విజయవాడ జంక్షన్, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామలకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతూ విశాఖపట్టణం చేరుకోనుంది. అయితే.. ఇన్ని స్టేషన్లలో ‘సికింద్రాబాద్-విశాఖపట్టణం వందే భారత్ ఎక్స్ ప్రెస్’ మొదటి రోజు మాత్రమే ఆగనుంది. ఆ తర్వాత రోజు నుంచి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే ఈ ప్రత్యేకమైన రైలు ఆగనుంది.

