Telangana

సీఎస్ సోమేష్ కుమార్ కు ఎదురుదెబ్బ

తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి సోమేష్ కుమార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఏపీ క్యాడర్ కు వెళ్లాల్సిందేనని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఆయన సేవలు తెలంగాణకు అవసరం అనుకుంటే ఆంధ్రప్రదేశ్ అనుమతితో డిప్యుటేషన్‌పై రావొచ్చని సూచించింది. రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ కుమార్ ను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. అయితే దీనిపై క్యాట్ ను ఆశ్రయించిన సోమేష్ కుమార్ మధ్యంతర ఉత్తర్వులతో తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 2017 నుంచి ఈ కేసు హైకోర్టులో నడుస్తోంది. తాజాగా క్యాట్ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో ఆయన ఏపీకి వెళ్లాలని సూచించింది. అయితే సోమేష్ కుమార్ తరుపు న్యాయవాది మూడు వారాలు సమయం కోరారు. ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఏపీ క్యాడర్ కు వెళ్లాలని హైకోర్టు సూచించింది. మరి సోమేష్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.