Home Page SliderPoliticsTelangana

బీఆర్‌ఎస్‌ పార్టీలో ఆంధ్రా నేతలు

ఏపీకి చెందిన పలువురు నేతలు ఇవాళ  బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మాజీ మంత్రి రావెల కిషోర్‌ బాబు, మాజీ ఐఏఎస్‌ తోట చంద్రశేఖర్‌, మాజీ ఐఆర్‌ఎస్‌ చింతల పార్థసారథి.. సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి బీఆర్‌ఎస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు టీజే ప్రకాశ్‌ (అనంతపురం), తాడివాక రమేశ్‌ నాయుడు (కాపునాడు, జాతీయ అధ్యక్షుడు), గిద్దల శ్రీనివాస్‌ నాయుడు (కాపునాడు, ప్రధాన కార్యదర్శి), రామారావు (ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు) కూడా బీఆర్‌ఎస్‌ పార్టీ తీర్థం పుచుకున్నారు.