టీటీడీ ఈవో (ఎఫ్.ఎ.సి)గా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు
అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ ఈవో ఫుల్ అడిషనల్ చార్జ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారి ఆలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. బంగారు వాకిలి వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. సింఘాల్‌ను అదనపు ఈఓ(ఎఫ్.ఎ.సి) వీరబ్రహ్మం ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు.

